Tollywood : మాస్ మహరాజాతో ఆషికా రంగనాథ్!

Tollywood : మాస్ మహరాజాతో ఆషికా రంగనాథ్!
X

మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న సినిమా మాస్ జాతర. ఈ సినిమా భాను బోగవరపు దర్శకత్వంలో వస్తోంది. ఈ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రవితేజ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో ఓ మూవీ కమిట్ అయ్యారు. అయితే ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో, ఇప్పుడు మన టాలీవుడ్ దర్శక రచయితలు అదే జోనర్ లో సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నారట. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలు రాసుకుంటున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి సినిమానే రవితేజ హీరోగా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ కోసం హీరోయిన్ల వేట మొదలు పెట్టారు. ఇప్పటికే కేతికా శర్మను సెలెక్ట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా నటిస్తుందని సమాచారం. ఈ సినిమాలో రెండో హీరోయిన్గా ఆషికా రంగనాథ్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'నా సామిరంగ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, మొదటి మూవీతోనే తన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందీ కన్నడ భామ. ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు మాస్ రాజా రవితేజతో యాక్టింగ్ చేసేందుకు సై అంటోందీ భామ.

Tags

Next Story