Ashish Next Movie : స్ట్రీట్ డ్రమ్మర్ గా ఆశిష్

వెర్సటైల్ క్యారెక్టర్లతో హీరోగా తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలని తొలి సినిమా నుంచి ప్రయత్నాలు చేస్తున్న ఆశిష్... తాజాగా మన కల్చర్ ని రిప్రజెంట్ చేసే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతు న్నాడు. రౌడీ బాయ్స్ మూవీతో హీరోగా పరిచయమైన ఆశిష్ తరువాత 'లవ్ మీ ' పేరుతో హారర్ థ్రిల్లర్లో నటించాడు. అయితే అది ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దీంతో కొంత విరామం తీసుకున్న కొత్త కథను ఎంచుకున్నాడు. ఈ మూవీకి ఆదిత్య రావు గంగసాని దర్శకత్వం వహిస్తుండగా ఇందులో ఆశిష్ అత్యంత సహజత్వంతో సాగే స్ట్రీట్ డ్రమ్మర్ గా నేటివిటీకి చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్ట ర్ తో పాటు టైటిల్ ని మేకర్స్ ఇవాళ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'దేత్తడి' అనే టైటిల్ని ఫైనల్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ లో హీరో ఆశిష్ టైటిలు తగ్గట్టుగానే మాసీవ్ క్యారెక్టర్ స్ట్రీట్ డ్రమ్మర్గా కనిపించడంఅందరిని ఆకట్టుకుంటోంది. 'గాడ్ ఫటీతో ఫటీ మగర్ నవాబి నా ఘటీ' అనే క్యాప్షన్ పెట్టారు. ఆశిష్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్, క్యాప్షన్ని బట్టి ఈ మూవీ పక్కా తెలంగాణ స్లాంగ్తో తో సాగుతుందని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com