Avatar 3 : అవతార్ 3 ఫస్ట్‌లుక్.. ట్రైలర్ ఎప్పుడంటే!

X
By - Manikanta |22 July 2025 1:45 PM IST
'అవతార్ 3' ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు 'అవతార్: ఫైర్ అండ్ యాష్' అనే టైటిల్ ఖరారు చేయబడింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమా టైటిల్‌ను ప్రతిబింబిస్తూ ఉందని తెలుస్తోంది. 'అవతార్ 3' మొదటి ట్రైలర్‌ను జూలై 25, 2025న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను "ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్" సినిమాతో పాటు థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. 'అవతార్ 3: ఫైర్ అండ్ యాష్' సినిమా డిసెంబర్ 19, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా పంచ భూతాల కాన్సెప్ట్‌తో వస్తుందని, మొదటి రెండు భాగాల్లో నేల, నీటిని చూపించిన జేమ్స్ కామెరూన్, ఇప్పుడు మూడో భాగంలో 'నిప్పు' (ఫైర్) ఆధారంగా కథను కొనసాగించనున్నారని తెలుస్తోంది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com