Actor Avika Gor : అవికా గోర్ ... డార్క్ షేడ్ సో సో క్యూట్

Actor Avika Gor : అవికా గోర్ ... డార్క్ షేడ్ సో సో క్యూట్
X

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో దక్షిణాది ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది అవికా గోర్. బాలనటిగా బుల్లితెరపై సందడి చేసిన ఈఅమ్మడు.. ఇప్పుడు సిల్వర్ స్ర్కీన్ పై అలరించింది. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆతర్వాత సినిమా చూపిస్త మావతో హిట్ అందుకుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అవికా.. హిందీ సినిమాల్లోనూ చాన్స్ కొట్టేసింది. అయితే హీరోయిన్ అవికా గోర్ కొన్నాళ్ల పాటు బిజీగా ఉన్నప్పటికీ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. అంతే కాకుండా కొన్ని అనవసర ఎంపికల కారణంగా ఇండస్ట్రీలో ఈబ్యూటీ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యూలర్ గా ఫొటోలు షేర్చేస్తూ అభిమానులతో టచ్ లోనే ఉంటోంది. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన పిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డార్క్ షేడ్ ఔట్ ఫిట్ తో అవికా అందాలతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో క్యూట్, బ్యూటిఫుల్ అంటూ ఫ్యాన్స్ పోస్టులుపెడుతున్నారు. అందానికి తగ్గట్లు ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు రాకపోవడం దారుణం అని, ముందు ముందు అయినా ఈబ్యూటీకి ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags

Next Story