Kangana Ranaut : అవార్డులు పనికిరావు.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్ !

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ లీడ్ రోల్ లో నటించి, స్వీయదర్శకత్వం వహించిన మూవీ ఎమర్జెన్సీ. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ సహా దివంగత నటుడు సతీశ్ కౌశిక్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని కంగనానే నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ జనవరి 17న థియేటర్ లోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం చివరకు ఆశించిన ఫలితాల ను రాకపోవడంతో గతనెల 14 నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్న ఈ చిత్రంపై నిత్యానందం అనే వ్యక్తి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ ను ఎలాంటి బెరుకు లేకుండా రూపొందించిన కంగనను మెచ్చుకున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా ఇన్స్టా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. అతడు రాసిన లేఖను ఇన్స్టా వేదికగా షేర్ చేసిన కంగన.. తాను తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’కి గాను కాంచీవరం సిల్క్ చీర బహుమతిగా పంపినట్లు వెల్లడించింది. ఆ గిఫ్ట్ తనకు ఎంతో విలువైందని పేర్కొంది. అటు బాలీవుడ్ అవార్డుల కార్యక్రమాలపై అసహనం వ్యక్తం చేసింది. పనికిమా లిన అవార్డుల కంటే ఈ చీర ఎంతో విలువైందని ఇన్స్టాలో రాసుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com