Bahubali Prabhas : బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త

ఇండియన్ సినిమా హిస్టరీని మార్చేసిన సినిమా.. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన సినిమా.. అప్పటి వరకూ భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని భ్రమించిన వారి మబ్బులు తొలగించిన సినిమా.. మనమూ హాలీవుడ్ రేంజ్ మూవీస్ తీయొచ్చు అని అన్ని భాషల మేకర్స్ ను అలెర్ట్ చేసిన సినిమా.. అపజయమే లేని ఓ దర్శకుడి కల.. ఆ కల కళగా మారి కోట్లమంది ప్రేక్షకులను చేరి.. ఇండియన్ సినిమా అంటే ఇది.. ఇక్కడ ఉంది అని నిరూపించిన సినిమా. అదే బాహుబలి. రాజమౌళి డ్రీమ్ వాల్డ్ లో పాత్రలుగా మారి ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఇప్పుడు తిరుగులేని స్టార్ గా అవతరించిన ప్రభాస్ ఛరిష్మానూ చూపించిన సినిమా. ఫస్ట్ పార్ట్ తెలుగోడి దమ్మును చూపితే సెకండ్ పార్ట్ వాల్డ్ వైడ్ గా ఉన్న తోప్ మేకర్స్ ను ఫిదా చేసింది. అలాంటి మూవీ రెండు భాగాలూ ఒకేసారి చూసే అవకాశం వస్తే.. ఎలా ఉంటుంది..? యస్.. అదే జరగబోతోంది. త్వరలోనే ఈ రెండు భాగాలూ ఒకే భాగంగా మారి మన ముందుకు రాబోతోంది.
ఇప్పటి వరకూ వచ్చిన, వస్తోన్న రీ రిలీజ్ లకు భిన్నంగా, ఓ కొత్త ట్రెండ్ ను కూడా క్రియేట్ చేస్తూ బాహుబలి, బాహుబలి 2 చిత్రాలను కలిపి ఒకే భాగంగా మార్చి మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఇవాళ్టి (జూలై 10)కి బాహుబలి : ద బిగెనింగ్ విడుదలై పదేళ్లు. ఈ సందర్భంగా సినిమా రీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 31న బాహుబలి రెండు భాగాలనూ కలిపి ఒకే పార్ట్ గా రీ రిలీజ్ చేయబోతున్నాం అని అనౌన్స్ చేశారు. విశేషం ఏంటంటే.. రెండు సినిమాలు అంటే ఐదు గంటలకు పైగా ఉంటుందని భావిస్తూ.. కొంత ఎడిట్ చేస్తారేమో అనుకున్నారు. బట్ వీళ్లు ఎడిట్ కాకుండా ఇంకా కొన్ని అప్పుడు చూడని సీన్స్ ను యాడ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా సర్ ప్రైజింగ్ మేటర్ అనే చెప్పాలి.
ఇక ప్రభాస్ తో పాటు రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, ప్రభాకర్ (కాలకేయ), తనికెళ్ల భరణి, అడివి శేష్ వంటి భారీ తారాగణం ఈ చిత్రానికే వన్నె తెచ్చారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ కే కాక బాహుబలి లవర్స్ అందరికీ ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com