Jani Master : జానీ మాస్టర్‌కు బెయిల్

Jani Master : జానీ మాస్టర్‌కు బెయిల్
X

అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కు ఊరట దక్కింది. ఆయకు మధ్యంతర బెయిల్‌ మంజూరు అయింది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని అందుకుగాను బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా, దానిని పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్‌ మంజూరు చేసింది. అక్టోబరు 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. రెండు లక్షల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది.

బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు ఇటీవల జాతీయ అవార్డు ప్రకటించారు. అక్టోబర్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవానికి హాజరై.. పురస్కారం అందుకోనున్నారు. ఈ కారణంతోనే బెయిల్‌ మంజూరు చేసినట్టు చెబుతున్నారు.

ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, అలాగే మరో మారు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయన్ని అరెస్టు చేసి కస్టడీకి తరలించారు.

Tags

Next Story