Balakrishna Unstoppable: ఆహా.. ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్..

Balakrishna Unstoppable: ఆహా.. ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్..
X
Balakrishna Unstoppable: ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో.. అన్ స్టాపబుల్ షోతో అదరగొడుతున్నాడు బాలకృష్ణ.

Balakrishna Unstoppable: ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో.. అన్ స్టాపబుల్ షోతో అదరగొడుతున్నాడు బాలకృష్ణ. తనదైన టైమింగ్ తో ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ థింకింగ్ ను కూడా మార్చేశాడు. ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు సెకండ్ సీజన్ లోనూ అదే రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఈ షోకు అద్భుతమైన ఆదరణ రావడానికి కేవలం బాలయ్య హోస్టింగ్ ప్రధాన కారణం.


వచ్చిన గెస్ట్ లకూ మెమరబుల్ గా మార్చేస్తున్నాడు. ఇక ఈ షోకు ఎప్పటి నుంచో ప్రభాస్ వస్తాడు అనే ప్రచారం ఉంది. అది ఇప్పుడు నిజమైంది. తన ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి బాలయ్య ఎదుట కూర్చున్నాడు. ఇప్పటికే ఈ మేటర్ ఆహా నుంచి అఫీషియల్ గా కన్ఫార్మ్ చేశారు.



దీంతో ఈ షో ఎప్పుడెప్పుడు స్ట్రీమ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ వెండితెరపై ఎంత రౌద్రంగా కనిపించినా.. టాక్ షోస్ లో మాట్లాడటానికి సిగ్గు పడుతుంటాడు. అది ఇక్కడ కూడా కనిపించింది. ఆ సిగ్గును కవర్ చేసేందుకే ఫ్రెండ్ గోపీచంద్ తో వచ్చాడు అనుకోవచ్చు.

Tags

Next Story