Balayya vs Pawan Kalyan : బాలయ్య వర్సెస్ పవన్ కళ్యాణ్..

Balayya vs Pawan Kalyan :  బాలయ్య వర్సెస్ పవన్ కళ్యాణ్..
X

స్టార్ హీరోలకు రిలీజ్ డేట్స్ పెద్ద సమస్యగానే ఉంటుందెప్పుడూ. ఒక్కోసారి ఒకే డేట్ పై అందరి కన్నూ ఉంటుంది. అదే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు బాలయ్య, పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇది రిపీట్ అవుతోంది. ఈ సారి బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరి మధ్య పోటీ తప్పేలా కనిపించడం లేదు. కాకపోతే ఎవరో ఒకరు తప్పుకుంటారు అనే ప్రచారం ఉంది. మరి వీరిలో తగ్గేదెవరు.. నెగ్గేదెవరు.. అసలు మేటర్ ఏంటీ అనేది చూస్తే..

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘అఖండ2’ను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్టు గతంలోనే ప్రకటించారు. తర్వాత అదే డేట్ కు సాయిదుర్గా తేజ్ నటిస్తోన్న సంబరాల ఏటిగట్టును కూడా అదే డేట్ కు రిలీజ్ చేస్తాం అని ప్రకటించారు. ఇక్కడి వరకూ ఓకే. బాలయ్య, సాయిదుర్గా తేజ్ మధ్య పోటీ అనే మాటే ఉండదు కాబట్టి. అయితే అదే డేట్ కు పవన్ కళ్యాణ్ ‘ఓ.జి’ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తాం అని అఫీషియల్ గానే ప్రకటించారు మేకర్స్. నిజానికి ఈ డేట్ లో ప్రభాస్ రాజా సాబ్ వస్తుందని భావించారు చాలామంది. మరి ఈ డేట్ పై ఎందుకు ఇంత ఆసక్తి అంటే.. ఆ టైమ్ కే దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. యస్.. ఈ సారి దసరా అక్టోబర్ 2న వచ్చింది. అంటే వారం ముందుగానే హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కదా. అందుకే అది క్రేజీ డేట్ అయింది.

ఇక ప్రభాస్ రాజా సాబ్ డిసెంబర్ 5కి వెళ్లిపోయింది. దాని అర్థం ఓ.జి వస్తోందని. సో.. ఇప్పుడు వార్ అఖండ 2, ఓజి మధ్య ఉండబోతోంది. వాస్తవంగా చూస్తే ఓ.జిని లాస్ట్ ఇయస్ సెప్టెంబర్ 27న అన్నారు. యేడాది తర్వాత దానికి రెండు రోజుల ముందు వస్తాం అంటున్నారు. మరి ఓ.జి వస్తే బాలయ్య బరిలోనే ఉంటాడా లేక తప్పుకుంటాడా.. లేదూ ఇద్దరి సినిమాలూ ఇదే సీజన్ లో వచ్చినా.. ఒకటీ రెండు రోజుల గ్యాప్ తో విడుదల చేస్తారా అనేది చూడాలి. బట్ ఒకే రోజు రెండు సినిమాలు విడుదలైతే మాత్రం ఓపెనింగ్ డే రికార్డ్స్ పోతాయి. ఇద్దరి సినిమాలూ ఆ మేరకు నష్టపోతాయి. ఒకట్రెండు రోజుల గ్యాప్ అంటే ఇద్దరికీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ఉంటుంది. మరి ఏమవుతుందో చూడాలి.

Tags

Next Story