Bappi Lahiri: ప్రముఖ సింగర్ బప్పీలహరి కన్నుమూత..

Bappi Lahiri (tv5news.in)
Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహరి కన్నుమూశారు. 69 ఏళ్ల బప్పీలహరి ముంబాయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1970, 80ల్లో బప్పీలహరి పాటలు బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్. డిస్కో డ్యాన్సర్ పాట అయితే ఇప్పటికీ ప్రేక్షకులు ఎవ్వరూ మర్చిపోలేరు. బప్పీలహరి చివరిగా 2020లో విడుదలయిన బాఘీ 3లో భన్కాస్ అనే పాట పాడారు.
గత ఏడాది బప్పీలహరికి కరోనా సోకడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే అనారోగ్యం కారణంగా బప్పీలహరి తన స్వరాన్ని కోల్పోయాడని వచ్చిన వార్తలు పెద్ద దుమారాన్నే రేపాయి. కొన్నాళ్లకు బప్పీలహరి అవన్నీ అబద్ధాలని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆయన కోలుకున్న తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. హఠాత్తుగా ఆయన మరణవార్త ఫ్యాన్స్‌ను శోకసంద్రంలో ముంచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com