Bayan : టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు బయాన్

Bayan : టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు బయాన్
X

ఒక మహిళ చేసే పోరాటం ఇతి వృత్తంగా తెరకెక్కిన సినిమా బయాన్. బికాస్ రంజన్ మిశ్రా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఫ్ 2025)కు ఎంపికైంది. ఈ నేపథ్యంలో నటి హ్యుమా ఆనందం వ్యక్తంచేశారు. తనకు ఇష్టమైన పాత్ర పోషించే అవకాశాన్ని బయాస్ ఇచ్చిందన్నారు. న్యాయవ్యవస్థలోని వ్యక్తి అయినప్పటికీ, చాలా పెద్ద శక్తులను ఎదుర్కొనే పాత్ర తనకు దక్కిందని తెలిపారు. ఈ చిత్ర బృందంతో పనిచేయడం సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు. డిస్కవరీ విభాగంలో బయాన్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికవడం తనలో ఉత్సాహాన్ని నింపిందని తెలిపింది. 'బయాన్'ను టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించ డం గర్వంగా ఉంది' అని చిత్ర దర్శకుడు బికాస్ రంజన్ మిశ్రా ఆనందం వ్యక్తంచే శారు. డిస్కవరీ విభాగంలో ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం 'బయాన్' కావడం విశేషం. ఈ చిత్రంలో హ్యుమా ఖురేషీతోపాటు, చంద్రచూ ర్ సింగ్, సచిన్ ఖేడ్కర్, పరితోష్ సాండ్, అభిజిత్ దత్, మయాంక్, సంపా మండల్, స్వాతి దాస్, అదితి కాంచన్ సింగ్, పెర్రీ ఛబ్రా తదితరులు నటించారు.

Tags

Next Story