Krithi Shetty : రెడ్ డ్రెస్ లో బేబమ్మ.. ఫొటోలు వైరల్

Krithi Shetty : రెడ్ డ్రెస్ లో బేబమ్మ.. ఫొటోలు వైరల్
X

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన నటి కృతి శెట్టి. 2021లో విడుదలైన ఈ సినిమా కృతికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి నటించారు. కృతి చివరిసారిగా ఏఆర్ఎం అనే మలయాళం యాక్షన్అడ్వెంచర్ చిత్రంలో కనిపించిందీ. కృతి త్వరలో జెనీ సినిమాలో కనిపించనుంది. జెనీ తమిళ ఫాంటసీ కామెడీ సినిమా. అర్జునన్ జూనియర్ దర్శకుడు. వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ కింద ఇషారి కె. గణేష్ దీనిని నిర్మించారు. ఈ సినిమాలో రవి మోహన్ రెండు పాత్రల్లో నటించారు. కృతి శెట్టి, కళ్యాణి ప్రియద ర్శన్, వామికా గబ్బి నటిస్తున్నారు. అయితే సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోందీ భామ. తాజాగా రెడ్ డ్రెస్ లో హొయలు పోతూ తీయించుకున్న ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. వీటిని చూసిన ఫ్యాన్స్ బేబమ్మ అదుర్స్ అని కామెంట్లు పెడుతున్నారు.

Tags

Next Story