Kriti Shetty : బేబమ్మ మళ్లీ వస్తోంది.. నానితో వన్స్ మోర్

Kriti Shetty : బేబమ్మ మళ్లీ వస్తోంది.. నానితో వన్స్ మోర్
X

బేబమ్మ మళ్లీ వస్తోంది.. నానితో వన్స్ మోర్ఉప్పెన సినిమాతో సునామీ సృష్టించిన కృతిశెట్టికి క్రమంగా ఆ తర్వాత డౌన్ ఫాల్ స్టా ర్టయ్యింది. టాలీవుడ్ లో నాలుగు ఐదు ఫ్లాప్స్ పడటంతో ఆఫర్లు కరువయ్యాయి. శర్వా నంగ్తో కలిసి మనమే సినిమాలో చివరగా కనిపించిందీ భామ. ఆ సినిమా కూడా కమ ర్షియల్గా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేక పోయింది. టాలీవుడ్ లో కృతి శెట్టికి ఇక ఆఫర్లు దక్కడం కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమిళ్ సినీ ఇండస్ట్రీలో మూడు సినిమాల్లో నటిస్తోందీ అమ్మడు. ఇతర భాష ల్లోనే ఈమె బిజీ కావాల్సిందే కానీ టాలీవుడ్లో ఆఫర్లు దక్కించుకోవడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమైంది. సరిగ్గా ఇదే టైంలో నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్ గా నటించే చాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. దసరా సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఆ మధ్య సినిమా నుంచి వచ్చిన టీజర్ అంచనాల ను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా నాని పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగు తోంది. నానిని మరీ అంత బోల్డ్ పాత్రలో చూడగలమా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాలో నానికి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నా యి. నానితో కృతి శెట్టి గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ది ప్యారడైజ్ సినిమాలో కృతి శెట్టిని ఎంపిక చేసే విషయమై శ్రీకాంత్ ఓదెల చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు దర్శకుడు శ్రీకాంత్ తుది నిర్ణయం తీసుకోలేదు.

Tags

Next Story