Kriti Shetty : బాలీవుడ్ లో బేబమ్మ ఐటెం సాంగ్

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఐటెం సాంగ్ కు రెడీ అయ్యిందని తెలుస్తోంది. బేబమ్మ పాత్రలో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ వైపు చూస్తోందట. ఉప్పెన్ తర్వాత నానితో శ్యాసింగరాయ్'. నాగ చైతన్యతో 'బంగార్రాజు' సినిమాల్లో నటించి హ్యా ట్రిక్ కొట్టింది. ఆ తర్వాత రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగులో ఆమె నటించిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో ఆమె కెరీర్ కు బిగ్ మైనస్ లోకి పడిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కృతి శెట్టి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ అందుకోవడం సంచలనంగా మారింది. అది కూడా ఒక ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతుందట. ఈ అమ్మడికి ఐటెం సాంగ్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈపరిస్థితిలో కృతి శెట్టి తీసుకున్నఈనిర్ణయం రిస్క్ అని చెప్పాల్సిందే.పైగా,బాలీవుడ్‌లో ప్రత్యేక గీతాల్లో నటిస్తే భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావంపడే అవకాశం ఉంటుంది. అయినా,అన్నీ తెలిసిన కృతి శెట్టి ఈ అవకాశాన్ని ఎలా అంగీకరించింది?అనే ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com