Bhairavam : బెల్లంకొండ 'భైరవం'

తమిళంలో సూరి, శశికుమార్, ఉన్ని ముకుందన్ కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గరుడన్’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రిమేక్ లో నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం చిత్రాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను 2025 కానుకగా సంక్రాంతి రిలీజ్ అనుకుంటున్నారట. కానీ సంక్రాంతికి ఇప్పడికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య బాబీ సినిమా, సందీప్ కిషన్ సినిమాలు కర్చీఫ్ వేసుకుని రెడీ గా ఉన్నాయి. కాబట్టి భైరవం సినిమా ఈ ఏడాది డిసెంబర్ 25న రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఛత్రపతి వంటి భారీ డిజాస్టర్ తర్వాత వస్తున్నఈ సినిమా బెల్లంకొండ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com