రోడ్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన నటుడు

రోడ్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన నటుడు
ఉత్తమ నటుడు జాతీయ అవార్డు గ్రహీత సంచారి విజయ్ కన్నుమూయడం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఉత్తమ నటుడు జాతీయ అవార్డు గ్రహీత సంచారి విజయ్ కన్నుమూయడం కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జూన్ 12 రాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ఆయన్ని బతికించే ప్రయత్నం చేశారు. అనేక శస్త్రచికిత్సలు నిర్వహించినప్పటికీ అతను జూన్ 14 మధ్యాహ్నం మరణించాడు. 38 ఏళ్ల విజయ్ తన స్నేహితుడు నవీన్‌తో కలిసి బెంగళూరులో రాత్రి 11:45 గంటలకు మందులు కొనడానికి వెళ్తున్నాడు.

దురదృష్టవశాత్తు, వారు ప్రయాణిస్తున్న బైక్ స్కిడ్ అయి లాంప్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లిందని చెప్పారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు గమనించి వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా నవీన్ కాలు విరిగినట్లు గుర్తించారు. విజయ్ తలకు, కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యుల పర్యవేక్షణలో నవీన్ కోలుకుంటున్నాడు. కానీ విజయ్‌కి బ్రెయిన్ డెడ్ అవడంతో మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

కాగా విజయ్ అవయవాలను దానం చేయడానికి అతడి కుటుంబం ముందుకు వచ్చింది. విజయ్ మరణ వార్త విని అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. సంచారి విజయ్ 2015 లో వచ్చిన కన్నడ చిత్రం 'నాను అవనిల్లా అవలు' లో పరివర్తనకు ఒక లింగమార్పిడి పాత్ర పోషించాడు, ఇది అతనికి భారతదేశంలో ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందింది. అదే చిత్రానికి కర్ణాటక రాష్ట్రం నుంచి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డును కూడా అందుకున్నాడు.



కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ట్విట్టర్లో ఒక సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు "సంచారి విజయ్ ఇక లేడన్న వార్తను అంగీకరించడం చాలా కష్టంగా ఉంది. అతన్ని రెండుసార్లు కలుసుకున్నాను. చాలా బాధగా ఉంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి'' అని పేర్కొన్నారు.

థియేటర్ ఆర్టిస్ట్‌గా ఉన్న సంచారి విజయ్ వీరప్పన్ బయోపిక్ 'కిల్లింగ్ వీరప్పన్' తో సహా డజనుకు పైగా చిత్రాల్లో నటించారు. ఇందులో అతను పోలీసు అధికారి గోపాల్ పాత్ర పోషించాడు. ఆయన రాబోయే చిత్రాలు 'అటాకుంటు లెకాకిల్లా' మరియు 'మెలోబ్బా మాయావి'.

Tags

Next Story