Sitara Ghattamaneni : ఫేక్ అకౌంట్‌లతో జాగ్రత్త.. మహేష బాబు కూతురు రిక్వెస్ట్...

Sitara Ghattamaneni : ఫేక్ అకౌంట్‌లతో జాగ్రత్త.. మహేష బాబు కూతురు రిక్వెస్ట్...
X

ప్రముఖ నటుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలోకి రాకముందే తన తండ్రితో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది సితార. చిన్న వయసులోనే పలు బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుండే సితార తాజాగా తన పేరు మీద ఉన్న నకిలీ అకౌంట్ ల పై స్పందించారు. ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే తనకు అకౌంట్ ఉందని..మరే ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లోనూ తనకు అధికారిక ఖాతా లేదని ఆమె స్పష్టం చేశారు.

ఈ మేరకు సితార తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. "నా పేరు మీద చాలా నకిలీ, స్పామ్ అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ నేను చెప్పేది ఒక్కటే. నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటాను. ఇది మాత్రమే నా అధికారిక ఖాతా. వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ నేను లేను. దయచేసి నా పేరుతో ఉన్న ఇతర ఖాతాలతో జాగ్రత్తగా ఉండండి" అని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Tags

Next Story