Kaantha : కాంత’లో భాగ్య శ్రీ.. ఆకట్టుకుంటున్న లుక్

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘కాంత’ సినిమా నుంచి విడుదలైన భాగ్యశ్రీ బోర్సే లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో సంప్రదాయ వస్త్రధారణలో లూజ్ హెయిర్‌తో ఆమె కనిపిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 1950 కాలంలో మద్రాస్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ‘‘1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కాంత’. అప్పటి మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలను ఆవిష్కరించే చిత్రం ఇది. ఈ బహు భాషా చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ప్రస్తుతం ‘కాంత’తో పాటు రాపో 22, కింగ్‌డమ్ సినిమాల్లో నటిస్తున్నారు.
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
బ్యానర్లు: స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయికృష్ణ గద్వాల్
లైన్ ప్రొడ్యూసర్ – శ్రవణ్ పాలపర్తి
DOP – డాని శాంచెజ్ లోపెజ్
ఆర్ట్ డైరెక్టర్ – రామలింగం
రచయిత – తమిళ్ ప్రభ
సంగీతం- జాను
ఎడిటర్ – లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్
కాస్ట్యూమ్ డిజైనింగ్: పూజిత తాడికొండ, సంజన శ్రీనివాస్
పీఆర్వో: వంశీ-శేఖర్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com