Actress Bhagya Sri : 6 నెలల దాకా భాగ్య శ్రీ బిజీ బిజీ

Actress Bhagya Sri : 6 నెలల దాకా భాగ్య శ్రీ బిజీ బిజీ
X

'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది భాగ్య శ్రీ . అయితే ఈ మూవీతో ఆమె ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అనతి కాలంలోనే క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఈ అమ్మడు వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్లో ఉంది. ప్రస్తుతం కాంత, కింగ్డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల్లో నటిస్తోంది అమ్మడు. అందులో ఒకటి విజయ్ దేవరకొండ కింగ్డమ్ కాగా మరోటి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా ఉంది. ఈ రెండింటితో పాటు దుల్కర్ సల్మాన్ రానా నటిస్తున్న కాంత సినిమా కూడా ఉంది. ఆల్రెడీ అమ్మడికి మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. సో హిట్ లేకపోయినా సక్సెస్ ఖాతా తెరవకపోయినా కూడా భాగ్య శ్రీ డిమాండ్ అలా ఉంది. ఈమధ్య ఒక సినిమా కోసం భాగ్య శ్రీ నిదర్శక నిర్మాతలు కలిస్తే మరో ఆరు నెలల దాకా ఏమి చెప్పలేనని అన్నదట.

Tags

Next Story