Deviyani Sharma : ఆఫర్ల కోసం భానుమతి వెయిటింగ్

'భానుమతి & రామకృష్ణ' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి దేవియాని శర్మ. రొమాంటిక్, సైతాన్ సినిమాల్లోతన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది 'సేవ్ ది టైగర్స్' చిత్రంలో ఒక్క సారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. తక్కువ టైంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు టాలీవుడ్లో వరుస ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోంది. దేవియాని విభిన్నమైన ఔట్ ఫిట్ ధరించడం ద్వారా ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ భామ లేటెస్ట్ గా తన గ్లామరస్ ఫొటోషూట్తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టెన్నిస్ రాకెట్ చేతిలో పట్టి, పొట్టి స్కర్ట్ ధరించి ఫొటోలకు పోజ్ ఇచ్చింది. నడుము అందం చూపిస్తూ కవ్వించే చూపులతో హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్సెనెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే ఇంత అందంగా ఉన్న దేవియాని శర్మకు పెద్దగా ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో చాలా మందితో పోల్చితే ఈబ్యూటీ చాలా అందంగా ఉంది అంటూ పొగడ్తలతో ముంచె త్తుతున్నారు. సోషల్ మీడియాలో దేవియాని శర్మ ఇదే స్థాయిలో అందమైన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటే.. ఏదో ఒక రోజు ఆమె కచ్చితంగా మంచి గుర్తింపు దక్కించుకోవడం మాత్రమే కాకుండా నటిగానూ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ పోస్టులు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com