Bhola shankar Teaser : నేడే 'భోళా శంకర్' టీజర్ రిలీజ్

మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళా శంకర్' సినిమా నుంచి టీజర్ రిలీజ్ డేట్ ఖరారైంది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ రిలీజ్ కానున్నట్లు చిత్ర యునిట్ ప్రకటించింది. దీంతో మెగా అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. రెండు రోజుల క్రితమే రామ్ చరణ్, ఉపాసనా దంపతులకు చిన్నారి జన్మించి.. మెగా ఫ్యామిలీలో, అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇప్పుడు భోళా శంకర్ కూడా అభిమానులను అలరించడానికి రెడీ అయింది.
ఈ చిత్రాన్ని మేహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిరుకు జోడీగా తమన్నా నటిస్తోంది. మెగాస్టార్ కు చెల్లెలి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తోంది. టీజర్ రిలీజ్ గాను ఏకే టీం ట్వీట్ చేసింది. మెగా సెలెబ్రేషన్స్ కు రెడీగా ఉండాలని కోరింది. అగస్టు 11న థియేటర్లలో విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com