Prabhas : ఇదే కదా కావాల్సింది.. ప్రభాస్ ఫ్యాన్స్‌‌కి మాంచి కిక్కిచ్చే న్యూస్..

Prabhas : ఇదే కదా కావాల్సింది.. ప్రభాస్ ఫ్యాన్స్‌‌కి మాంచి కిక్కిచ్చే న్యూస్..
X
Prabhas : డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌‌కి పక్కా కిక్కిచ్చే న్యూస్ ఇది.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం దగ్గరలోనే ఉంది..

Prabhas : డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌‌కి పక్కా కిక్కిచ్చే న్యూస్ ఇది.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం దగ్గరలోనే ఉంది.. ఇంతకీ అదేంటంటే.. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే... ఇది ప్రభాస్‌‌కి 25వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు సందీప్.. అందుకే ప్రభాస్‌‌ని ఇప్పటివరకు ఎవరు చూడని, చూడాలనుకుంటున్న రోల్‌‌లో చూపించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫిసర్‌గా కనిపించబోతున్నాడట.

అవును... ఈ విషయాన్ని ఆదిపురుష్‌ ప్రొడ్యూసర్‌ భూషణ్‌ కుమార్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రభాస్‌‌ని ఇంతవరకు అభిమానులు అలా చూడలేదు. అభిమానులు మాత్రం ప్రభాస్‌‌ని ఆ రోల్‌లో చూడాలని ఎప్పటినుంచో ఆరాటపడుతున్నారు. ఆ కోరిక ఇప్పుడు స్పిరిట్‌ మూవీ తీరబోతుందని చెప్పుకోవచ్చు.. కాగా ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌ రిలీజ్‌‌కి దగ్గరలో ఉంది. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాధాకృష్ణ కుమార్‌ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్‌‌గా నటించింది.

Tags

Next Story