Kalki 2 : హమ్మయ్య.. కల్కి 2పై బిగ్ అప్డేట్

Kalki 2 :  హమ్మయ్య.. కల్కి 2పై బిగ్ అప్డేట్
X

కల్కి.. 2024 జూన్ 27న విడుదలైన మూవీ. భారీ బడ్జెట్ తో పాటు భారీ తారాగణం నటించిన సినిమా. సినిమా అంచనాలకు అందుకునే స్థాయిలో విజయం సాధించింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ నటించిన ఈ ఫిక్షనల్, మైథలాజికల్ మూవీకి గొప్ప ఆదరణ కూడా దక్కింది. అలాంటి మూవీకి సీక్వెల్ కూడా ఉందని ముందే చెప్పారు. బట్ ఈ మూవీ విడుదలై చాలా రోజులవుతోంది. దాదాపు యేడాదిన్నరకు పైగా సీక్వెల్ ఉంటుందా ఉండదా అనే మాటలు వినిపించాయి. వాటన్నిటికీ సమాధానం చెబుతూ తాజాగా కల్కి 2 కు సంబంధించిన బిగ్ న్యూస్ చెప్పింది మూవీ టీమ్.

ప్రభాస్ తో పాటు సంజయ్ దత్, దీపికా పదుకోణ్, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన వంటి తారాగణం నటించిన మూవీ ఇది. అయితే ఈ పార్ట్ లో దీపికా పదుకోణ్ ను తప్పించారు. ఆ పాత్రలో వేరే వారిని తీసుకోబోతున్నారు. మరి ఆ నటి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. బట్ ఈ పార్ట్ లో మాత్రం దీపికా పాత్ర మాత్రం చాలా కీలకంగా ఉండబోతోంది అనుకున్నారు. ఈ మేరకు కథలో ఏమైనా మార్పులు చేశాయోమో తెలియాల్సి ఉంది.

ఇక కల్కి 2 మాత్రం ఈ యేడాది ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కాబోతోందని టాక్. ఆ రోజు నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ షెడ్యూల్ లో కమల్ హాసన్ పాత్రను కీలకంగా రూపొందించబోతున్నారు. ప్రభాస్ మాత్రం ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడు. ఇక తర్వాత నుంచి మాగ్జిమం రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నారట. దీంతో పాటు ప్రభాస్ స్పిరిట్ కూ డేట్స్ ఇచ్చాడు. సో.. రెండు సినిమాలూ సైమల్టేనియస్ గా రూపొందించబోతున్నారు. ఇక కల్కి 2 లో ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ సీన్స్ చాలా ఉంటాయని టాక్. ఆ మేరకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాడు. మొత్తంగా కల్కి 2 ఫిబ్రవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కల్కి2 ఫ్యాన్స్ కు మాత్రం గ్రేట్ న్యూస్ చెప్పారు.

Tags

Next Story