Srileela : బిగ్ అప్ డేట్.. ‘పెద్ది'లో శ్రీలీల

మెగా హీరోరామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది'. ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరా జుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదిత రులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా 1980లో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యం లో రూపొందుతోంది. అయితే తాజాగా ఈమూవీలో ఓ మాస్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు. దీని కోసం రామ్ చరణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల స్టె ప్పులు వేయబోతుందట. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేస్తున్న ఒక ఫుల్ ఎనర్జిటిక్ ఐటెం సాంగ్ తో థియేటర్ దద్దరిల్లేలా శ్రీలీల చేయనుందని అంటున్నారు. ఈపాట రామ్ చరణ్ పాత్రకు టర్నింగ్ పాయింట్గా ఉం డబోతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజం ఉందో తేలినప్పటికీ ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు గతేడాది వచ్చిన 'పుష్ప 2'లో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ యూత్లో జోష్ నింపిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com