Bigg Boss 5 Telugu: సిరితో ఉంటున్నాడని షన్నూకు.. కోపం ఎక్కువని సన్నీకి..

Bigg Boss 5 Telugu (tv5news.in)
Bigg Boss 5 Telugu: ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఏ సీజన్‌లో జరగని గొడవలు, కాంట్రవర్సీలను ఈ సీజన్‌లోనే చూస్తున్నారు ప్రేక్షకులు. రోజుకు ఏదో ఒక టాస్క్ జరిగినా, జరగకపోయినా.. గొడవలు మాత్రం కామన్ అయిపోయాయి. మొదటి వారంలో కూల్‌గా ఉన్న హౌస్‌మేట్స్ కూడా ఇప్పుడు చిన్నవాటికే రియాక్ట్ అయిపోతున్నారు. ఇటీవల షన్నూ ప్రవర్తన చూశాక ఇది నిజమే అనిపిస్తోంది.
ఈసారి బిగ్ బాస్‌లో ఎవరికి ప్రేక్షకుల నుండి సపోర్ట్ ఎక్కువ, ఎవరికి తక్కువ అన్న విషయాన్ని చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఈ వారం ఓటింగ్ లిస్ట్‌లో ఒకరు టాప్‌లో ఉంటే వచ్చే వారానికి ఆ లెక్కలు అన్నీ తారుమారవుతున్నాయి. చివరి వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చెప్పడం చాలా కష్టమయ్యింది. ప్రస్తుతం షన్నూ, సన్నీ మధ్య సీరియస్ కాంపిటీషనే నడుస్తోంది.
షన్నూ ఒక యూట్యూబర్‌గా, డ్యాన్సర్‌గా చాలామంది ప్రేక్షకులకు పరిచయం. కానీ సన్నీ అలా కాదు.. బుల్లితెర యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. తరువాత సీరియల్ నటుడిగా మారాడు. అందుకే షన్నూ ఫ్యాన్ ఫాలోయింగ్ కంటే సన్నీకి ఉన్న ఫాలోయింగ్ కాస్త తక్కువే. కానీ హౌస్‌లోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే సన్నీ తన గేమ్‌తో చాలామందిని ఆకట్టుకున్నాడు. ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్నాడు.
షన్నూ, సన్నీకి ఇప్పుడు సమానంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే ఓట్ల విషయంలో కూడా వీరిద్దరు పోటాపోటీగా ముందుకెళ్తున్నారు. ఈవారం హౌస్‌లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. సన్నీ.. సిరిని తిట్టడం వల్ల షన్నూ మధ్యలో వచ్చి అలా మాట్లాడడం తప్పు అంటూ కాస్త గట్టిగానే హెచ్చరించాడు. దీంతో సన్నీ కూడా ఎప్పటిలాగానే కోపంగా రియాక్ట్ అయ్యాడు.
అయితే ఈ గొడవలో సన్నీకి ఎన్ని మార్కులు పడ్డాయో.. షన్నూకు కూడా అన్నే మార్కులు పడ్డాయి.. సిరికే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ.. షన్నూ తన గేమ్ ఫ్లోనను మిస్ అవుతున్నాడని తనపై నెగిటివ్ కామెంట్స్ వస్తే.. సన్నీ కోపంలో నోరు పారేసుకుంటున్నాడని తనపై కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. పాజిటివ్‌లో అయినా.. నెగిటివ్‌లో అయినా.. ఇద్దరు సమానంగా ఉన్నారని.. ఇద్దరికి సమానంగా స్క్రీన్ స్పేస్ లభిస్తుందని బిగ్ బాస్ ప్రేక్షకులు అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com