Bigg Boss 5 Telugu: కరోనా కలకలం..ఇద్దరికి పాజిటివ్.

Bigg Boss 5 Telugu: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులోకి బిగ్ బాస్ షో మొదలైన సమయంలో దీన్ని ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఊహించని విధంగా ఈ షోను ప్రేక్షకులే సూపర్ హిట్ చేశారు. అయితే బిగ్బాస్లో వచ్చే కంటెస్టెంట్లకు వచ్చే ఫాలోయింగ్ మాములుగా ఉండదు. బిగ్ బాస్ షో ద్వారా జనాల్లో వారి మంచి గుర్తింపు వస్తుంది. నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్(bigg boss).
ఇక త్వరలోనే 5వ సీజన్ కూడా మొదలవబోతుంది. ఇటీవలే బిగ్‌బాస్-5 లోగో, ప్రోమో విడుదల చేసింది స్టార్ మా చానల్. సెప్టెంబర్ 5నుంచి ఈ షో రాబోతుందని ప్రకటించింది. ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. శనివారం, ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్‌లు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. దీంతో బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు వార్తలు, లీకులు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు కరోనా సోకిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇద్దరు కంటెస్టెంట్లు కొవిడ్ బారిన పడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. మరో వైపు షో ప్రారంభ తేది దగ్గర పడుతుండడంతో కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. నెట్టింట్లో కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రియ, నవ్య స్వామి, యాంకర్ వర్షిణి, యాంకర్ ప్రత్యూష, నటరాజ్, సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్ రవి ఇలా అనేక మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Time to end the boredom. #BiggBossTelugu5 starting September 5th at 6 PM on #StarMaa pic.twitter.com/lcEtuEGGBq
— starmaa (@StarMaa) August 26, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com