Shanmukh Jaswanth: విన్నర్ కాకపోయినా షణ్నుకి బిగ్‌బాస్ బాగానే..

Shanmukh Jaswanth: షణ్ను బిగ్‌బాస్ విన్నర్ అవకపోతేనేం బాబుకి బాగానే నగదు ముట్టజెప్పాడు బిగ్‌బాస్. వెబ్‌సిరీస్‌తో యువతను ఆకట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్ హౌస్‌లోకి అడుగు పెట్టాక కప్పు అతడిదే అనుకున్నారు బుల్లి తెర ప్రేక్షకులు.
బయట కామ్ అండ్ కూల్ గోయింగ్ పర్సన్‌గా పేరు తెచ్చుకున్న షణ్ను లోపల ఎత్తులకు పై ఎత్తులు వేసి బిగ్‌బాస్ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు. పాపులర్ యూట్యూబర్ అయినా పదిమందితో కలవాలంటే సిగ్గు, బిడియం.. వాటినుంచి బయటపడి హౌస్‌ని సభ్యులతో మింగిల్ అవడానికి చాలా వారాల సమయమే పట్టింది షణ్నుకి.
ఇక సిరి, షణ్ణు ఫ్రెండ్‌షిప్‌ని కూడా ఎలివేట్ చేశాడు బిగ్‌బాస్. కొందరికి అది ఎంత మాత్రం రుచించలేదు. పైగా బయట ఇద్దరికీ లవర్స్ ఉన్నారు. లోపల వాళ్లు నడిపిన లవ్ ట్రాక్ అంతా ఉత్తుత్తుదే అనుకోవడానికి లేదు.. ఒక్కోసారి సిరిని కాపాడుకోవాలన్న తాపత్రయంలో తనకు తెలియకుండానే ఆమెపై అజమాయిషీ చేశాడు షణ్ను.
ఇలాంటివే అతడిపై ఉన్న మంచి ఇంప్రెషన్ పోవడానికి కారణమైంది. అయితే చివరి వరకు సన్నీకి గట్టి పోటీ ఇచ్చినా ఆడియన్స్ ఓట్లతో అతడు రన్నరప్‌గా నిలిచాడు.. బిగ్‌బాస్ టైటిల్ మిస్ అయినా పారితోషికం మాత్రం బాగానే అందినట్లు తెలుస్తోంది. ఒక్క వారానికి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది.
యాంకర్ రవి తర్వాత అత్యధిక పారితోషికం అందుకున్న షణ్ను సీజన్ మొత్తానికిగాను రూ.65లక్షల పైనే అందుకున్నట్లు నెట్టింట్లో వైరల్ అవుతోంది. విన్నర్ ప్రైజ్ మనీ రూ.50లక్షలు.. కాగా అదనంగా కొన్ని పెర్క్స్ కూడా అందాయి విజేత సన్నీకి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com