Shanmukh Jaswanth: కలిసొచ్చిన 'బిగ్‌బాస్'.. బయటకు వచ్చాక బంపరాఫర్

Shanmukh Jaswanth: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరైన తరువాత మరింత పాపులర్ అవుతారు కొందరు కంటెస్టెంట్లు.. అంతకు ముందు వాళ్లెవరో తెలియదు. హౌస్‌లోకి అడుగుపెట్టీ పెట్టగానే జనాల్లో వాళ్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది.. కానీ సీజన్‌లో 5లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్ అప్పటికే పాపులర్ యూట్యూబర్.
పరిచయం అక్కరలేని పేరు.. వెబ్‌సిరీస్ ద్వారా నెటిజన్లకు మరింత చేరువయ్యాడు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్, లైకులు వస్తాయి షణ్ణు వీడియోలకు.. మృదుస్వభావిగా, తనపనేదో తాను చేసుకుపోతూ బిగ్‌బాస్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లలో ఒకడిగా నిలుస్తున్నాడు.
షో బిగినింగ్‌లో సైలెంట్‌గా, టాస్కులకు దూరంగా ఉన్న షణ్ణు రాను రాను తనదైన శైలిలో ఆడి అందర్నీ ఆకట్టుకున్నాడు. మిగతా కంటెస్టెంట్స్ వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ 'బిగ్‌బాస్ బ్రహ్మ'గా పేరు సంపాదించుకున్నాడు. కామ్‌గా ఉంటూనే కత్తిలాంటి ప్లాన్లు వేస్తూ ఆట చివరి వరకు నిలిచాడు. దీంతో అతడు టాప్ 2లో ఉండే అవకాశం ఉందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
ఇదిలా ఉంటే షణ్ణు కల నెరవేరబోతోంది.. సినిమా హీరోగా ఓ ఛాన్స్ కొట్టేశాడట. యూట్యూబ్‌స్టార్‌గా ఎదిగినప్పటినుంచి షణ్ముఖ్ సినిమా అవకాశాలకోసం ఎదురుచూస్తున్నాడు. మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినా వద్దనుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాక అతడికి ఫాలోయింగ్ మరింత ఎక్కువైంది. దీంతో దర్శక, నిర్మాతలు అతడితో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తు్న్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com