Bollywood Actress : బాలీవుడ్ నటి నికితా దత్తాకు కరోనా

కరోనా ఒమిక్రాన్ కొత్త వేరింట్ ఇండియాలోకి వచ్చేసింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న శిల్పా శిరోద్కర్ కు కొవిడ్ పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి కరోనా బారిన పడ్డారు. హీరోయిన్ నికితా దత్తా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ విషయాన్ని నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనతోపాటు తన తల్లికి కూడా కొవిడ్ సోకినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నాలుగు రోజుల క్రితం శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిం చాలంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com