Actress Nimrat Kaur : అతడి చెంపపై కొట్టిన బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్

డెయిరీ మిల్క్ కమర్షియల్ యాడ్ తో పాపులర్ అయిన బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్. వరుసగా రెండు సినిమాలు కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి ఆమె నటనకూ మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత హిందీలో రెండు, మూడు అమెరికన్ టీవీ సిరీస్ లలో చేసింది. 'ది లంబ్బాక్స్', ‘దాస్వి', 'ఎయిర్అఫ్ట్' వంటి చిత్రా లతోనూ అలరించింది. ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ ప్రీ మియర్ కనిపించి ఫ్యాషన్ ప్రపంచాన్ని అలరించింది. తాజాగా ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.తాను 19 ఏండ్ల వయసులో సుప్రీంకోర్టులోనే లైంగికవేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. 'లా చదువుతున్నప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్లా. కోర్టు రూమ్ అంతా లాయర్లతో నిండిపోగా, జడ్జి వాదనలు వింటున్నారు. ఇంతలో నా వెనుక ఎవరో చేయి వేశారు. తిరిగి చూడగా అతడో సీనియర్ లాయర్. పక్కకు జరిగినా మళ్లీ అలాగే చేశాడు. తొలుత ఆందోళనకు లోనైనా వెంటనే తేరుకొని అతడి చెంపపై ఒక్కటిచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయా' అని పేర్కొంది. కాగా నిమ్రత్తో మాయణం కారణంగానే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోవడం ఖాయమన్న పుకార్లు గతంలో జోరుగా వ్యా పించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com