శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాలో కొత్త కోణం..పొర్నోగ్రఫీ కేసులో అరెస్ట్..
శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా
Raj Kundra Arrest: బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారన్న ఆరోపణలతో సోమవారం సోమవారం(జులై 19) రాత్రి సమయంలో రాజ్ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌కుంద్రాపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ' ఫిబ్రవరి,2021లో ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో పోర్న్ చిత్రాలకు సంబంధించి కేసు నమోదైంది.
పోర్న్ చిత్రాల నిర్మాణం, పలు ఆండ్రాయిడ్ యాప్స్‌లో వాటిని అప్‌లోడ్ చేసిన కారణంగా ఈ కేసు నమోదు చేశాం. ఇందులో రాజ్‌కుంద్రా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంద అని ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోర్న్ చిత్రాల నిర్మాణానికి సంబంధించిన కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో రాజ్ కుంద్రా పాత్ర కీలకంగా ఉందని నిర్దారించామని ముంబై పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com