Kriti Sanon : పెళ్లికి రెడీ అంటున్న బాలీవుడ్ భామ!

Kriti Sanon : పెళ్లికి రెడీ అంటున్న బాలీవుడ్ భామ!
X

బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ అంటే కుర్రకారుకు పిచ్చి క్రేజ్. రెబల్ స్టార్ ప్రభాస్ తో జోడీగా ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించింది.తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ మూవీలో ఆమె నటనకు మంచి మార్కులే సొంతం చేసుకుంది. రీసెంట్ గా వచ్చిన దో పత్తీ మూవీతో ఆడియన్స్ ను అలరించింది. అయితే తాజాగా అప్డేట్స్ ప్రకారం కృతిసనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఆమె డేటింగ్ లో ఉందని పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. అయితే వీరి రిలేషన్ షిప్ పై హీరో కార్తిక్ ఆర్యన్ స్పందించాడు. "నేను సింగిల్, ఎవరికీ లైవ్ లొకేషన్ పంపాల్సిన అవసరం లేదు. అని చెప్పుకొచ్చాడు. ఇక కృతిసనన్ డేటింగ్ పై స్పందించింది. ప్రస్తుతం తాను ఏ డేటింగ్ లో లేనని.. షూటింగ్ లో బిజీగా ఉన్నానని తెలిపింది. ఇక కృతిసనన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చందు ఛాంపియన్ మూవీలో నటిస్తోంది.

Tags

Next Story