Prabhas 25th Film: ప్రభాస్ కోసం బాలీవుడ్ భామ.. హీరోయిన్‌గా కాదు విలన్‌గా..

Prabhas (tv5news.in)
Prabhas 25th Film: సాధారణంగా సినిమాల్లో విలన్‌లుగా మేల్ యాక్టర్లే ఉంటారు. ఫీమేల్ యాక్టర్లను విలన్లుగా ఎంపిక చేసే సందర్భాలు చాలా తక్కువ. కానీ అలా చేసిన సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌నే చవిచూసాయి. తాజాగా రెబెల్ స్టార్ కోసం ఒక బాలీవుడ్ భామ విలన్‌గా నటించనుందని సమాచారం. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ అప్పుడే దీని గురించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కరీనా కపూర్ ఖాన్.. బాలీవుడ్‌లో ఇప్పటికీ బిజీ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సీనియర్ నటి. ఒకపక్క తన పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూనే.. మరోపక్క తన ప్రొఫెషనల్ లైఫ్‌పై దృష్టి పెడుతోంది కరీనా. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తున్న కరీనా టాలీవుడ్‌లోకి విలన్‌గా అడుగుపెట్టనుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా మొదలయ్యాయట.
ప్రభాస్ కాల్ షీట్లు రానున్న మూడు సంవత్సరాల వరకు ఖాళీగా లేదు. ఇప్పటికే తన చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నా.. తాజాగా సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అయితే ఇందులో నటించే నటీనటుల గురించి ఇప్పటివరకు ఏ అప్డేట్ రాకపోయినా ఇందులో విలన్‌గా కరీనా కనిపించబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమయితే ఆదిపురుష్‌లో సైఫ్‌తో తలపడనున్న ప్రభాస్.. స్పిరిట్‌లో కరీనాతో ఢీ కొట్టనున్నాడనమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com