Bollywood : దీపావళి కానుకగా రామాయణ

Bollywood : దీపావళి కానుకగా రామాయణ
X

బాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాను నితీష్ తివారి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ సెట్‌ నుంచి లీకైన ఫోటోలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అప్పటినుండి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. తాజాగా ‘రామాయణ’ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రామాయణ పార్ట్ 1 దీపావళి కానుకగా 2026లో, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు పోస్టర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతోంది.

Tags

Next Story