Film Updates : బాక్సాఫీస్ పోటీ .. తమ్ముడు Vs 3 బీహెచ్ కె

Film Updates : బాక్సాఫీస్ పోటీ .. తమ్ముడు Vs 3 బీహెచ్ కె
X

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరి ల్లు సినిమాలతో హిట్ కొట్టిన తమిళనటుడు సిద్ధార్థ్. టాలీవుడ్ ఎంట్రీతోనే సెన్టేషన్స్ క్రియేట్ చేశాడు. తెలుగులో కెరీర్ బెడిసి కొట్టడంతో ఓన్ ఇండస్ట్రీలోకి బ్యాగ్ సర్దేసుకున్నాడు సిద్ధు. తమిళ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న టైంలో మళ్లీ మనసు టాలీవుడ్ పైకి లాగేసింది. దీంతో నెగిటివ్ రోల్, సెకండ్ హీరో రోల్ అని చూడకుండా మహా సముద్రంతో రీ ఎంట్రీ ఇస్తే అది కాస్తా ఫ్లాప్ మూటగట్టుకుంది. ఇండియన్ 2, మిస్ యు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక ఇప్పుడు 3 బీహెచ్కేతో మళ్లీ రాబోతున్నాడు సిద్దు. శరత్ కుమార్, దేవయాని, గుడ్ నైట్ ఫేం మీథా రఘునాద్ కీ రోల్స్ చేస్తున్నారు. ఓ మధ్య తరగతి కుటుంబం.. సొంత ఇంటి కలను నేరవేర్చుకుందా లేదా అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెర కెక్కుతోంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ జులై 4న విడుదల కానుంది. సరిగ్గా అదే రోజు నితిన్, సప్తమీ గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన తమ్ముడు సినిమా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల్లో ఏది హిట్టవు తుందో చూడాలి మరి.

Tags

Next Story