Brahma Anandam OTT : ఓటీటీలోకి బ్రహ్మ ఆనందం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

బ్రహ్మానందం.. ఆయన కుమారుడు రాజాగౌతమ్ తాత మనవళ్లుగా నటించిన చిత్రం 'బ్రహ్మా ఆనందం’ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఆరీవీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కుటుంబ కథాచిత్రం గా రూపుదిద్దుకొంది. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. బ్రహ్మానందం యాక్టింగ్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆహా వేదికగా ఇది మార్చి 14 నుంచి స్ట్రీమిం గ్ కానుందని టీమ్ వెల్లడించింది. మానవ సంబంధాలు, భావోద్వేగాలు, తాత మనవడి మధ్య రిలేషన్, ప్రేమ, జీవిత లక్ష్యాలు లాంటి అంశాలను జోడించి రూపొందించిన చిత్రం ఇది. ఆర్వీ ఎల్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ సమ ర్పించింది. రాహుల్ యాదవ్ నక్కా ఈ మూవీని నిర్మించారు. రాజా గౌతమ్, పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com