Amaran OTT : అమరన్ ఓటీటీకి బ్రేక్

Amaran OTT : అమరన్ ఓటీటీకి బ్రేక్
X

బాన్సువాడ భానుమతి గా తెలుగు ప్రేక్షకులను అలరించిన సాయిపల్లవి, కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద రాజన్ నిజ జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ అక్టోబర్ 31న థియే టర్లలోకి వచ్చింది. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మంచి కలెక్షన్స్ రాబడు తోంది. మూవీలో మలయాళ బ్యూటీ సాయిపల్లవి ఆర్మీ ఆఫీసర్ భార్య ఇందూ క్యారెక్టర్ లో కనిపించి ఆడియన్స్ వద్ద మంచి మార్కులు కొట్టేసింది. కాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. నిజానికి మూవీ థియేటర్ లో రిలీజైన 28 రోజులకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ మూవీకి థియేటర్లలో ఇంకా క్రేజ్ తగ్గకపోవడంతో మేకర్స్ మూవీ ఓటీటీ రిలీజ్ ను కొన్ని రోజులు వాయిదా వేశారు. అంటే ఈ సినిమా డిసెంబర్ 5న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

Tags

Next Story