Actress Rana : హీరో రానా హిరణ్య కశ్యపకు బ్రేక్?

మహావతార్ నరసింహా మూవీ సెన్సేషనల్ విక్టరీ ఇండియన్ యానిమేషన్ రంగానికి మంచి ఊపు తెచ్చింది. స్టార్ కాస్ట్.. రెమ్యునరేషన్.. డేట్స్ .. షెడ్యూల్ ఇవేవి లేకుండా యానిమేనెట్ మూవీస్ చేస్తే ఆడియన్స్కు రీచ్ అవుతాయని ఈ మూవీ ఫలితం ప్రూప్ చేసింది. అదే సమయంలో హీరో రానాని కన్ఫ్యూజన్లో పడేసింది. నిజానికి ఆయన హిరణ్యకశ్యక అనే మూవీ చేయాలనుకున్నాడు. అది కూడా కాస్త అటు ఇటుగా మహావతార్ నరసింహా కథ లాంటిదే. ఆ కాన్సెఫ్ట్లోనే మూవీ చేయాలనుకున్నాడు. కానీ ఆయన ఆలోచనలకు మహావతార్ బ్రేక్ వేసేలా ఉంది. మరోవైపు టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ కూడా హిరణ్యకశ్యప మీద సినిమా చేయాలని అనుకున్నాడు. కొంత వర్క్ కూడా చేశాడు. అది కూడా రానాతోనే ఉంటుందని అంతా భావించారు. ఇప్పుడు వీళ్లిద్దరికీ మహావతార్ పెద్ద షాక్ ఇచ్చింది. మహావతార్ సిరీస్లు ప్రేక్షకులకు పూనకాలు చెప్పిస్తాయనేలా మొదటి సినిమాతోనే అదరగొట్టారు మేకర్స్. నెక్స్ట్ మహాపతార్ పరశురామ్ 2027లో రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. మరి హిరణ్యకశ్యప మూవీపై రానా, గుణశేఖర్ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com