Bride shortage: తమిళ తంబీల పెళ్లి గోల.. అమ్మాయిలు దొరకట్లేదట..

Bride shortage: తమిళ తంబీల పెళ్లి గోల.. అమ్మాయిలు దొరకట్లేదట..
Bride shortage: ఒకరో ఇద్దరో ఈ బాధ పడుతున్నారంటే అనుకోవచ్చు. ఏకంగా 40 వేల మంది యువకులు అమ్మాయిలు దొరకట్లేదని వాపోతున్నారు.

Bride shortage: ఏంటో.. ఇద్దరు పిల్లలకి తండ్రి అవ్వాల్సిన వయసులో పెళ్లి కావట్లేదని గోల పెడుతున్నారు తమిళ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువకులు. ఒకరో ఇద్దరో ఈ బాధ పడుతున్నారంటే అనుకోవచ్చు. ఏకంగా 40 వేల మంది యువకులు అమ్మాయిలు దొరకట్లేదని వాపోతున్నారు.

ఇక లాభం లేదని తమిళ బ్రాహ్మణ అసోసియేషన్ రంగంలోకి దిగింది. తమ స్టేట్‌లోని పెళ్లికాని ప్రసాదులకు పక్క స్టేట్‌‌లో అన్నా పిల్ల దొరుకుందేమో అని ఆశపడుతున్నారు. యూపీ, బీహార్‌లో ఇదే సామాజిక వర్గానికి చెందిన పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉన్నారేమో అని వెతికే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రకటన కూడా ఇచ్చారు సంఘం అధ్యక్షుడు నారాయణన్.

10 మంది అబ్బాయిలుంటే కేవలం ఆరుగురు అమ్మాయిలు మాత్రమే దొరుకుతున్నారు. మిగిలిన వారికి వివాహ వయసు మీరిపోతోందని తెలిపారు. హిందీ చదవడం, మాట్లాడడం, రాయడం వచ్చిన వారిని దిల్లీ, లఖ్‌నవూ, పాట్నాలలో ఏజెంట్లుగా నియమించుకుని తమ అబ్బాయిలకు తగిన వధువు దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు.

విద్యావేత్త పరమేశ్వరన్ ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ.. పెళ్లికొడుకు తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాల్సి ఉంది. తమ కుమారుడి పెళ్లి గ్రాండ్గా చేయాలనుకుంటారు. అందుకు అయ్యే ఖర్చంతా అమ్మాయి తరపు వారే భరించాల్సి వస్తోంది.

ఎంతకాదన్నా రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు పెళ్లి ఖర్చు ఉంటుంది. ఆర్ధిక స్థోమత ఉన్న వారికి అయితే ఇబ్బంది ఉండదు కానీ సామాన్యుల పరిస్థితి చాలా కష్టం. దిగువ, మధ్య తరగతి వారైతే అమ్మాయికి పెళ్లి చేస్తే అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తోంది. అందుకే పెళ్లంటే భయపడే పరిస్థితి తలెత్తింది అమ్మాయిల తల్లిదండ్రులకి. ఆ ఖర్చు కాస్త తగ్గించుకుంటే తమిళనాడులోనే అమ్మాయిలు దొరుకుతారు.

పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన పరిస్థితి రాదు అని పరమేశ్వరన్ అంటున్నారు. ఇటీవలి కాలంలో తెలుగు-తమిళ బ్రాహ్మణుల వివాహాలు, తమిళ-కన్నడ బ్రాహ్మణుల వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని వివరించారు. ఉత్తరాది నుంచి వచ్చిన ఊర్వశి అయినే తాళి కట్టేస్తామంటున్నా తమిళ బ్రాహ్మణ యువకులు. ఒకప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలు దొరికే వారు కాదు.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story