Amala Paul : బంపరాఫర్.. . ఖైదీ సీక్వెల్లో అమలాపాల్

Amala Paul : బంపరాఫర్.. . ఖైదీ సీక్వెల్లో అమలాపాల్
X

కోలీవుడ్ నటుడు కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రం ఖైదీ. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రకాష్ బాబు, ఎస్సార్ ప్రభు నిర్మించిన ఈమూవీ 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. కాగా త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ ను రూ పొందించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈమూవీని హిందీలో నటుడు అజయ్ దేవగన్ 'భోలా' పేరుతో రీమేక్ చేశాడు. ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, అక్కడ కూడా ఫర్వాలేదనిపించింది. తమిళం కార్తీ కథానాయకుడిగా నటించిన పాత్రను హిందీలో అజయ్ దేవగన్ పోషించారు. నరేన్ పాత్రలో నటి టబు కనిపించారు. అజయ్ దేవగన్ ఫిలిమ్స్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నటి అమ లాపాల్ కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను బాలీవుడ్లో కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను యూనిట్ వర్గాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా అమలాపాల్ ఇటీవల నటించిన మలయాళ చిత్రం గోట్ మంచి విజయాన్ని సాధించింది. తాజాగా బాలీవుడ్లోకి ఖైదీ 2తో మరోసారి సందడి చేయనుంది.

Tags

Next Story