Bunny-Trivikram Combo : మరోసారి బన్నీ – త్రివిక్రమ్ కాంబో సెట్?

X
By - Manikanta |17 Sept 2024 9:00 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమా తర్వాత బన్నీ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కే జై కొట్టాడట అల్లు అర్జున్. ఈ కాంబినేషన్ లో ఇప్పటికే ఒక సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. కానీ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. ఇప్పుడు అదే ప్రాజెక్టు ను తెరపైకి తీసుకువస్తున్నాడట బన్నీ. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని టాక్. తొందరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ బయటికి వచ్చే అవకాశం ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com