Srileela : బన్నీ డాన్సింగ్ కింగ్ : శ్రీలీల

హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కిన సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. వచ్చే నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు ఆదరణ లభిస్తోంది. ఇవాళ ఈ చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వ హించింది. ఈ సినిమా తనకెంతో ప్రత్యేక మని, ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర తాను చేయలేదని శ్రీలీల తెలిపింది. ఈసందర్భంగా పుష్ప - 2 లో ఐటం సాంగ్ ను ప్రస్తావిస్తూ.. అల్లు అర్జున్ ను పొగడ్తలతో ముంచెత్తింది. ఆయనే డాన్సింగ్ కింగ్ అంటూ కితాబు ఇచ్చేసింది లీల. అందుకే కిస్సిక్ పాట హిట్టయిందని చెప్పేసింది. 'షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక్క సాంగ్ మిగిలింది. శ్రీలీలతో కలిసి రెండోసారి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మాది హిట్ జోడి అవుతుంది. నా కెరీర్లో ఇది అత్యంత భారీ బడ్జెట్ మూవీ. ఈ క్రిస్మస్కు వచ్చి హిట్ అందుకుంటాను' అంటూ నితిన్ తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com