Tollywood : నితిన్ సరసన బుట్టబొమ్మ?

Tollywood : నితిన్ సరసన బుట్టబొమ్మ?
X

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ సినీ ఫెయిల్యూర్ ట్రాక్ కొనసాగుతోంది. అప్పుడెప్పుడో 'భీష్మ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. ఆ తర్వాత చేసిన చిత్రాలన్నీ ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయాయి. ఆయన నటించిన రీసెంట్ మూవీ 'తమ్ముడు' బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో నితిన్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తన నెక్స్ట్ చిత్రాన్ని 'ఇష్క్' వంటి బ్లాక్ బాస్టర్ అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించేం దుకు చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ మూవీలో నితిన్ హార్స్ రైడింగ్ చేస్తూ కనిపిస్తాడట. దానికోసం ఆయన గుర్రపుస్వారీ కూడా నేర్చుకుంటున్నాడని టాక్. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ పూజా హెగ్దే నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఇప్పటికే కథ లాక్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతు న్నాయి. ఒక ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. నితిన్ తో పూజా తొలిసారి నటిస్తుండటంతో ఈ పెయిర్ కొత్తగా ఉంటుందని అభిమానులు భావిస్తు న్నారు.

Tags

Next Story