Amitabh Bachchan : డైలాగ్స్ గుర్తుంటలేవు... బిగ్ బీ కీలక కామెంట్స్

Amitabh Bachchan : డైలాగ్స్ గుర్తుంటలేవు... బిగ్ బీ కీలక కామెంట్స్
X

సినిమా రంగంలో అన్ని అడ్డంకులు అధిగమించి స్టార్ డమ్ సంపాదించుకున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. భాష, ప్రాంతం, వయసుతో సంబంధం లేకుండా అనేక మంది అభిమానులు ఆయన సొంతం. నాలుగు దశాబ్దాల్లో సుమారు 180కి పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ నటుడిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. ఉత్తమ నటుడు కేటగిరీకి గాను 40సార్లు నామినేట్ అయి ఫిలింఫేర్ కు అతి ఎక్కువ సార్లు నామినేట్ అయిన నటుడు కూడా బచ్చనే. నటునిగానే కాక, నేపధ్య గాయునిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు. అందుకే ఆయన్ను 1984లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషన్, 2015లో పద్మవిభూషన్ వరించాయి. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన "లెగియన్ ఆఫ్ హాన ర్"తో గౌరవించింది. అలాంటి బిగ్ బీ తాజాగా ఇట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను సెట్స్ లో డైలాగ్స్ మరిచిపోతున్నట్లు చెప్పారు. వయసు మీదపడటమే ఇందుకు కారణంగా చెప్పుకొచ్చారు.

Tags

Next Story