Game Changer : సెన్సార్ కంప్లీట్ : గేమ్ ఛేంజర్ రన్ టైం 2.45 గంటలు

గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ వర్క్ పూర్తయింది. పొలిటికల్థ్రి ల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 2గంటల 45 నిమిషాలకు ఫైనల్ అయ్యింది. ఇవాళ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పై మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో నటించిన చిత్రం కావడంతో హోప్స్ పెరిగాయి. కియారా అద్వానీ, ఎస్ జే సూర్య, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు నటించిన గేమ్ చేంజర్ పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. కాలేజీ స్టూడెంట్, రైతు, ఎన్నికల అధికారిగా మొత్తం మూడు గెటప్స్ లో రామ్ చరణ్ కనిపించనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com