Chaganti : మహావతార్ నరసింహ సినిమా చూసిన చాగంటి...

Chaganti : మహావతార్ నరసింహ సినిమా చూసిన చాగంటి...
X

యానిమేటెడ్ మూవీ గా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత‌ అల్లు అరవింద్ సమర్పణలో విడుదలై మంచి స్పందన రాబ‌ట్టుకుంది. ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ చిత్రం హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్తుంది. కేవ‌లం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 230 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టి, ఇండియాలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ మూవీగా అరుదైన‌ ఘనత సాధించింది. కాగా తాజాగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, అల్లు అరవింద్, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డితో కలిసి థియేటర్‌లో ఈ సినిమా ను వీక్షించారు.

ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ.. మన పురాణాలకు చాలా దగ్గరగా ఈ సినిమా ఉంది. భక్త ప్రహ్లాద సినిమాలా ఇది కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. మనుషులతో కాకుండా బొమ్మలతో తీశారు. కానీ ఆ భక్తి, ఆ భావం, ఆ అనుభూతి మాత్రం నిజంగా ఆధ్యాత్మికంగా అనిపించింది. ఈ సినిమా చూస్తుంటే నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా చివరి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు" అని స్పందించారు. కాగా చాగంటి రివ్యూ వీడియోను గీతా ఆర్ట్స్, హోంబలే ఫిల్మ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసాయి.

Tags

Next Story