Chaitu Racing Time : చైతు రేసింగ్ టైం.. శోభిత ఫోటోలు రిలీజ్

Chaitu Racing Time : చైతు రేసింగ్ టైం.. శోభిత ఫోటోలు రిలీజ్
X

‘తండేల్' తో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరో అక్కినేని నాగ చైతన్య. అయితే ఈ కంబ్యాక్ తమ ఇంటి కోడలు శోభిత మహత్యం కూడా అని కింగ్ నాగ్ చెప్పడం ఇటీవల వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా ఈ యంగ్ జంట తమ పెళ్లయ్యాక సినిమాలు చేస్తూనే తమ వైవాహిక బంధాన్ని కూడా బ్యూటిఫుల్ గా కొనసాగిస్తున్నారు. నాగచైతన్యకు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు బైకులు, కార్లు, స్పోర్ట్స్ వెహికల్స్ లవర్ అని అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నోసార్లు అతడు రేస్ ట్రాక్స్ పై కనిపించాడు. తాజాగా ఈకపుల్.. చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రేసింగ్ ఎంజాయ్ చేశారు. శోభిత తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ప్రత్యేకమైన మూమెంట్సన్ ను షేర్ చేసింది. బ్లాక్ టాప్, ఖాకీ ట్రౌజర్స్ లో స్టైలిష్ లుక్లో ఉన్న శోభిత, కూల్ అండ్ క్యాజువల్ అవతార్ లో ఉన్న చైతు ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. హెల్మెట్ ధరించి రేస్ ట్రాక్ పై స్ట్రాంగ్ ఫోకస్ పెట్టిన ఆమె లుక్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే, చైతు కెరీర్ పరంగా ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అదే ట్రాక్ లో హ్యాపీగా వెళ్లేలా చేస్తున్నారు. ఇక మరోవైపు కార్తిక్ దండు దర్శకత్వంలో మరో థ్రిల్లర్ సినిమాను స్టార్ట్ చేసిన చైతూ మరో రెండు కథలపై కూడా చర్చలు జరుపుతున్నారు.

Tags

Next Story