Jhansi : జానీ మాస్టర్‌పై ఛాంబర్ కేసు గెలిచింది: ఝాన్సీ

Jhansi : జానీ మాస్టర్‌పై ఛాంబర్ కేసు గెలిచింది: ఝాన్సీ
X

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేసు గెలిచిందని నటి ఝాన్సీ వెల్లడించారు. ఛాంబర్ విధించిన ఆంక్షల్ని జానీ జిల్లా కోర్టులో సవాలు చేశారని, ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసిందని పేర్కొన్నారు. ‘పనిప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే కాక సంస్థలు POSH నిబంధనలు అమలుచేయాలని గుర్తుచేసే ఈ తీర్పు చాలా కీలకం’ అని ఆమె పేర్కొన్నారు.

ఝాన్సీ ( Jhansi ) తన పోస్ట్ లో.. " జిల్లా కోర్టులో ఛాంబర్స్ ఆదేశాలను సవాలు చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( jani master ) పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ కేసు గెలిచింది. ఈ రోజు ఆయన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇది చాలా ముఖ్యమైన తీర్పు. పని చేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని, POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు మద్దతు ఉందని రుజువైంది. ఫెడరేషన్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి, ధర్మం వైపు నిలబడి పోరాటం చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి నా ప్రత్యేక ధన్యవాదాలు" అని తెలిపింది.

Tags

Next Story