Chhava Movie : బాహుబలి-2ను అధిగమించిన ఛావా

Chhava Movie : బాహుబలి-2ను అధిగమించిన ఛావా
X

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమా హిందీలో ఇప్పటివరకు రూ.516.8 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ‘బాహుబలి-2’ హిందీ వసూళ్లను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,788కోట్లు రాబట్టిన బాహుబలి-2 హిందీలో రూ.510.99 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా ‘ఛావా’కు తెలుగులో 4 రోజుల్లో రూ.10కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

మరోవైపు ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఏప్రిల్‌ 11 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందంటూ పోస్ట్‌లు షేర్‌ అవుతున్నాయి. ఈ చిత్రం ఓటీటీ విడుదలయ్యాక అక్కడ కూడా రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్‌ ఆయన భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక జీవించేశారు.

Tags

Next Story