Peddi Movie : బన్నీలాగే చెర్రీ... పెద్ది మూవీపై సోషల్ మీడియాలో ట్రోల్స్

Peddi Movie : బన్నీలాగే చెర్రీ... పెద్ది మూవీపై సోషల్ మీడియాలో ట్రోల్స్
X

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఇందులో ఆయన గ్రామీణ నేపథ్యంలో ఓ రఫ్ అండ్ రా క్యారెక్టర్ ను పోషించనున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ చెర్రీకి జోడీగా నటిస్తుండగా, ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రకటించినప్పుడే కంటెంట్ లీక్స్ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు మరో లెవల్ కు వెళ్లాయి. అదే సమయంలో చెర్రీ లుక్ బన్నీని గుర్తు చేస్తుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. గడ్డంతో, గ్రామీణ నేపథ్యంలో నటించడం చెర్రీకి కొత్త కానప్పటికీ, ప్రత్యేకించి ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫోస్టర్ కు సంబంధించి స్టైల్, బాడీ లాంగ్వేజ్, సిగరెట్ తాగే విధానం అన్నీ కూడా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రను పోలి ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు.20 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్ చరణ్ పై వచ్చిన నెగెటివ్ టాక్ ను తొలగిస్తుందన్న నమ్మకంలో మేకర్స్ ఉన్నారు.

Tags

Next Story